Reading Time: 2 minutes

టొయోటా నుంచి వచ్చేస్తున్న ఫస్ట్ ఈవీ.. ఏప్రిల్‌లో లాంచ్ కానున్న క్రేజీ కార్లు ఇవే

Caption of Image.

ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్న వేళ భారత ఆటోమొబైల్ మార్కెట్ మరింత జోరు పెంచనుంది. ఎలక్ట్రిక్ కార్ల నుంచి లగ్జరీ సెడాన్ల వరకు.. ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీల నుంచి పవర్‌ఫుల్ ఆఫ్-రోడర్ల వరకు మార్కెట్‌లోకి కొత్త మోడళ్లు రాబోతున్నాయి. మీరు కారు కొనాలనే డ్రీమ్‌ని కొత్త మోడల్స్ పూర్తిగా మార్చేయెుచ్చు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్:
జర్మన్ కార్ మేకర్ ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ టైగన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఏప్రిల్ 9న ఆవిష్కరించనుంది. ఈ కొత్త మోడల్‌లో బయటి వైపు షార్పర్ స్టైలింగ్, కొత్త ఎల్ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా 1.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజిన్‌తో పాటు కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రావడం సిటీ డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. లోపల 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, ఏఐ అసిస్టెంట్, అప్‌డేటెడ్ డిజిటల్ క్లస్టర్‌తో కారు మరింత టెక్-శావీగా మారనుంది. దీని ధర సుమారు రూ.12 లక్షల నుండి ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.

MG మెజస్టర్: 
MG మోటార్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మెజస్టర్ ను ఏప్రిల్ 16న లాంచ్ చేయబోతోంది. ఇది చూడటానికి గ్లోస్టర్ లాగే ఉన్నా.. పర్ఫార్మెన్స్ పరంగా చాలా మార్పులు జరిగాయి. 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 215 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 10 రకాల ఆఫ్-రోడ్ మోడ్స్, ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్.. 810 mm వాటర్-వేడింగ్ కెపాసిటీ ఉండటం సాహసప్రియులకు పండగనే చెప్పుకోవాలి. లెవల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు ఈ కారుకు అదనపు సేఫ్టీని అందించనున్నాయి.

టొయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా: 
టొయోటా నుంచి వస్తున్న మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూజర్ ఎబెల్లా ఏప్రిల్ 15 ప్రాంతంలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 543 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీని ధర రూ.18 లక్షల నుంచి రూ.21 లక్షల మధ్య ఉండవచ్చు. ‘బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్’ ఆప్షన్‌ను కూడా టొయోటా పరిశీలిస్తుండటం వల్ల ఎలక్ట్రిక్ కార్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్:
లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ తన CLA ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఏప్రిల్ 24న లాంచ్ చేస్తోంది. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. లాంగ్ రేంజ్ వేరియంట్‌లో ఏకంగా 792 కిమీ ఆఫర్ చేస్తోంది. 800V ఆర్కిటెక్చర్ వల్ల కేవలం 20 నిమిషాల్లో 400 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ ఎక్కుతుంది ఈ ఈవీ. రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల ధరలో లభించే ఈ కారు.. ఇటు పర్యావరణానికి అటు లగ్జరీ ప్రయాణ అనుభూతికి కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని ఆటో నిపుణులు అంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.