Reading Time: < 1 minute
Ram Charan Peddi Movie Release Date Postponed Again Shoot Delay Update

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావలసి ఉంది. ముందుగా ఈ సినిమాని మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే షూట్ పూర్తి కాకపోవడంతో దాన్ని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. నిజానికి మార్చి 27వ తేదీన రిలీజ్ అయ్యి ఉంటే, శ్రీరామనవమి సెలవుల అడ్వాంటేజ్ కలిసి వచ్చేది. అయితే అది మిస్సయిన క్రమంలో 30వ తేదీన రిలీజ్ చేసి ఉంటే, మే ఒకటో తేదీ సెలవులు కలిసి వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత జూన్ 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది, కానీ ఇప్పటివరకు దానిమీద సరైన క్లారిటీ లేదు.

Also Read:LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..

అయితే దాదాపుగా ఏప్రిల్ 30వ తేదీన కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెబుతున్నారు. షూట్లో రామ్ చరణ్ నుదుటి మీద గాయం కావడంతో సహా, మరికొంత షూట్ పెండింగ్ ఉండడంతోనే సినిమా వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టీం మాత్రం ఇప్పటివరకు వాయిదా వేస్తున్న విషయాన్ని చెప్పలేదు, కానీ రెండు గోల్డెన్ డేట్స్ మిస్ అయినట్లు మాత్రం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తారా లేక చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.