Reading Time: < 1 minute
Up Aligarh Cylinder Blast Mosquito Coil Fire Accident Brothers Injured

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిర్దౌస్ నగర్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఇద్దరు సోదరులు తీవ్రగాయాలు పాలయ్యారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అలీగఢ్‌లోని ఖర్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్దౌస్ నగర్‌లో మంగళవారం రాత్రి 2:30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దోమల నివారణ కోసం అగరబత్తి లేదా గ్యాస్ లీక్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. షంషాద్ మార్కెట్‌లో షాజాద్, జర్రా అనే ఇద్దరు సోదరులు టీ స్టాల్ నడుపుతున్నారు. అయితే ఇంటిపై అంతస్తులో నాలుగు నుంచి ఐదు గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచారు.

అయితే దుకాణం మూసేశాక ఇంటికొచ్చాక మండే వస్తువు తగలగానే ఒక్కసారిగా సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. ఈ పేలుడులో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఇంటి పైభాగం కూడా కాలి బూడిదైపోయింది. ఇక పేలుళ్ల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పేలుళ్ల శబ్దానికి స్థానికులు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

ఇది కూడా చదవండి: Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రతకు భవనం మొత్తం కంపించిందని తెలిపారు. ఇక సంఘటనా స్థలంలో నాలుగు పగిలిన సిలిండర్లు లభించాయని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ తెలిపారు. గదిలోకి గ్యాస్ లీక్ అవుతోందని.. అగ్గిపుల్ల లేదా ఎలక్ట్రికల్ స్విచ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ సిలిండర్లను ఇంటి లోపల ఎందుకు నిల్వ ఉంచారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ