Reading Time: < 1 minute

హైదరాబాద్: సినిమా ఫీల్డ్ లోనే డ్రగ్ బానిసలు ఎక్కువగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని, సినీ తారలపైనే ఎక్కువ డ్రగ్ రూమర్స్ ఉన్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. యువతకు సినిమా హీరోలు ఆదర్శంగా ఉండాలని అన్నారు. సినీ తారలపై అనిరుథ్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులపై డ్రగ్ రూమర్స్ తక్కువేనని, తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని తెలియజేశారు. సినీ నటుడు బాలకృష్ణ ఏక్ పెగ్ లా అంటూ ఎంజాయ్ చేస్తారని, ఖుషి మూవీలో పవన్ కల్యాణ్ సారా తాగాడని అన్నారు. 90 రోజులకు ఓ సారి టెస్ట్ చేయించుకోవాలని.. డ్రగ్ టెస్ట్ లో నెగెటివ్ వస్తేనే షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వాలని దర్శకులను కోరారు. రూమర్స్ కి హీరోలే ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. తాను సారా అంటే తప్పు.. సినిమా హీరోలు బాటిల్స్ పట్టుకుంటే మాత్రం మంచిదని అనిరుధ్ రెడ్డి విమర్శించారు.