
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీశైలం ప్రాజెక్టులో పవర్ జెనరేషన్ చేయొద్దని నిబంధన ఉందని.. ట్రయిల్స్ చేయొద్దని జీవో కూడా ఉందని అన్నారు. తాగునీటి కోసం మాత్రమే వినియోగించాలని సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన జీవో స్పష్టంగా ఉందని అన్నారు జూపల్లి. తెలంగాణ హైకోర్టులో హై కోర్టు లో గతంలో పిల్ ఫైల్ కూడా చేశామని..జస్టిస్ పినాకి గోష్ ఇచ్చిన తీర్పు కూడా ఉందని అన్నారు జూపల్లి. కరెంటు ఉత్పత్తి చెయ్యడానికి వీలు లేదని అన్నారు.
దొంగతనంగా కరెంటు తీసుకోవాల్సిన ఖర్మ ఏపీకి ఎందుకని అన్నారు మంత్రి జూపల్లి. ధర్నా చేస్తామని చెప్పడంతో ఏపీ ప్రభుత్వం పంపింగ్ ఉపసంహరణ చేసుకుందని అన్నారు. పాలమూరు రైతాంగం, ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
వాటర్ అలకేషన్ అంశం కోర్ట్ లో పెండింగ్ లో ఉందని… 69 శాతం తెలంగాణకు 31 శాతం ఆంధ్రకు వాటా రావాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం మన రాష్ట్ర హక్కును కాపాడుతుందని.. అక్రమంగా నీటిని తరలిస్తే ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తోందని అన్నారు జూపల్లి. మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.