
బ్యాంక్ ఆఫ్‌బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (డబ్ల్యూఎంఎస్) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 16………………..
మొత్తం ఖాళీలు: 104.
విభాగాల వారీగా ఖాళీలు: ఏవీపీ II– గ్రూప్ హెడ్ 04, ఏవీపీ- II-– టెరిటరీ హెడ్ 18, డిప్యూటీ మేనేజర్– సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 70, డిప్యూటీ మేనేజర్– వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్ మెంట్అండ్ ఇన్సూరెన్స్) 13. –
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పోస్టును అనుసరించి పీజీ/ మేనేజ్‌మెంట్, ఎన్ఐఎస్ఎం/ ఐఆర్డీఏ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 27.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు మాజీ సైనికులకు రూ.175.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 16.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.bankofbaroda.bank.inను సందర్శించండి.