Reading Time: < 1 minute

ఇంకెంతమంది ఉన్నార్రా…? హైదరాబాద్లో రూ. 22 లక్షల అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్..

Caption of Image.

హైదరాబాద్ లో కల్తీరాయుళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆయిల్ మొదలుకొని… అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్చర్ వరకు ప్రతి వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కేటుగాళ్ళు. తరచూ ఎక్కడో ఒక చోట కల్తీ దందా బాగోతం బయటపడుతూనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో మరో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా గుట్టు రట్టయ్యింది. మంగళవారం ( మార్చి 31 ) హెచ్ ఫాస్ట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.

మైలార్ దేవ్ పల్లిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి చేశారు అధికారులు. ఈ దాడిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి అమ్ముతున్న హాసన్ అలీ రూపాని అనే వ్యక్తిని పట్టుకున్న హెచ్ ఫాస్ట్ అధికారులు. SKR ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో కలుషితం, నాణ్యత లేని అల్లం వెల్లుల్లి పేస్ట్ ను విక్రయిస్తున్నాడు నిందితుడు.

ఈ దాడిలో రూ. 22 లక్షల రూపాయల విలువైన  4 వేల 32 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 వేల కిలోల నాణ్యత లేని వెల్లుల్లి ని సీజ్ చేశారు అధికారులు. 210 కిలోల నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి పొట్టు సంచులతో పాటు  250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, 5 గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.