Reading Time: 2 minutes

మనలో చాలామందికి ఫోన్ బ్యాటరీ 100 శాతం ఛార్జ్ అయ్యే వరకు ఊరుకోని అలవాటు ఉంటుంది. కొందరైతే రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టేసి పడుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా త్వరగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్ ఎక్కువ కాలం మన్నాలన్నా, బ్యాటరీ పాడవకుండా ఉండాలన్నా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి. అవేంటో, అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

100 శాతం ఎందుకు ఛార్జ్ చేయకూడదు?: పెన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ చావో-యాంగ్ వాంగ్ ప్రకారం.. ప్రతిసారీ ఫోన్‌ను 100% ఛార్జ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే బ్యాటరీ ఫుల్ అయినప్పుడు దానిలో వోల్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక వోల్టేజ్ వల్ల బ్యాటరీ లోపల కొన్ని రసాయన మార్పులు జరిగి, అది త్వరగా బలహీనపడిపోతుంది.

20 నుండి 80 శాతం.. ఇదే గోల్డెన్ రూల్!: న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ దిబాకర్ దత్తా చెప్పిన దాని ప్రకారం.. మీరు ఫోన్‌ను 100% కి బదులుగా 90% వరకే ఛార్జ్ చేస్తే బ్యాటరీ జీవితకాలం మరో 10 నుండి 15 శాతం పెరుగుతుంది. ఇక అందుకే నిపుణులు ఎప్పుడూ ఫోన్ బ్యాటరీని 20 శాతం కంటే తగ్గకుండా, 80 శాతం కంటే పెరగకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Stop Charging to 100%! The Shocking Truth Experts Want You to Know
Stop Charging to 100%! The Shocking Truth Experts Want You to Know

తీవ్రమైన ఎండలు, చలి.. బ్యాటరీకి శత్రువులు!: మనం ఫోన్‌ను ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మీ ఫోన్‌ను ఎప్పుడూ విపరీతమైన ఎండలో గానీ లేదా విపరీతమైన చలి ఉన్న ప్రదేశాల్లో గానీ ఉంచకూడదు. ఇక ఫోన్ 100% ఛార్జ్ చేయడం కంటే కూడా ఇలాంటి వాతావరణంలో ఉంచడం బ్యాటరీకి చాలా ప్రమాదకరం. ఇది బ్యాటరీని పూర్తిగా దెబ్బతీస్తుంది.

అతి వేగంగా ఛార్జింగ్.. అంత మంచిది కాదు!: ఈ రోజుల్లో ఎక్కువ వాట్స్ ఉన్న ఫాస్ట్ ఛార్జర్లు బాగా ఎక్కువయ్యాయి. అయితే అవసరానికి మించి ఎక్కువ పవర్ ఉన్న ఫాస్ట్ ఛార్జర్‌తో పదే పదే ఛార్జ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. ఇక కాబట్టి మీ ఫోన్ కంపెనీ ఇచ్చిన లేదా రికమండ్ చేసిన సరైన ఛార్జర్‌ను మాత్రమే వాడటం ఎంతో మంచిది.

స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి దాని బ్యాటరీని కాపాడుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఇకపై రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టే అలవాటును మానుకోండి. ఇక అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా ఛార్జ్ చేస్తూ మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా చూసుకోండి.

గమనిక: పైన పేర్కొన్న సూచనలు లిథియం-అయాన్ బ్యాటరీల స్వభావాన్ని బట్టి నిపుణులు ఇచ్చినవి. అయితే అత్యవసర సమయాల్లో లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్‌ను 100% ఛార్జ్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.

The post ఫోన్‌ను 100% ఛార్జ్ చేయడం మంచిదేనా?.. ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిక appeared first on Manalokam – Latest Telugu News & Updates.