
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. సినిమా చూస్తూ ఓ ప్రేక్షకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి రిటైర్డ్ ఎఎస్ఐ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. 12వ బెటాలియన్‌లో ఉద్యోగం చేసి రిటైర్ అయినట్లు సమాచారం. సోమవారం ఉదయం 11.30 షో చూస్తేందుకు థియేటర్‌కి వచ్చాడు. సినిమా చూస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు థియేటర్ వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు.