
కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 10.
విభాగాల వారీగా ఖాళీలు: కానిస్టేబుల్ (బార్బర్) 03, కానిస్టేబుల్ ( వాషర్ మన్) 07.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఐదేండ్లు, ఓబీసీలు మూడేండ్లు, మాజీ సైనికులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 30.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 28.
సెలెక్షన్ ప్రాసెస్: పీఈటీ/ పీఎస్టీ, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి.
►ALSO READ | హైదరాబాద్ NGRIలో పార్ట్-టైమ్ ఉద్యోగాలు: ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లకి మంచి ఛాన్స్!