Reading Time: < 1 minute

హైదరాబాద్ కొత్తగూడ శ్మశానవాటిక దగ్గర ఉద్రిక్తత.. రోడ్డు విస్తరణపై స్థానికుల ఆందోళన..

Caption of Image.

హైదరాబాద్ కొత్తగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తగూడలోని శ్మశానవాటిక దగ్గర రోడ్డు విస్తరణ పనుల విషయంలో స్థానికులకు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. రోడ్డు విస్తరణ కోసం స్మశాన వాటిక గోడను తోలగించడానికి CMC అధికారులు యత్నించిన క్రమంలో అడ్డుకున్నారు స్థానికులు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్మశానవాటిక గోడను ఎలా తోఅల్గిస్తారంటూ ఆందోళనకు దిగారు స్థానికులు.

ఈ క్రమంలో స్థానికులకు, CMC సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్నమాదాపూర్ పోలీసులు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.

►ALSO READ | April 1 : అయ్యో పాపం.. ఆ తేదికి ఎంత కష్టవచ్చింది..సెలబ్రేషన్స్ డే కాస్త ఫూల్స్డే అయింది..! 

©️ VIL Media Pvt Ltd.