Reading Time: 2 minutes
Vivo Pad6 Pro Launched With 13 2 Inches 4k Display Snapdragon 8 Elite 13000mah Battery

vivo Pad6 Pro Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (vivo) చైనాలో తన సరికొత్త ఫ్లాగ్‌ షిప్ టాబ్లెట్ vivo Pad6 Proను గ్రాండ్‌ గా లాంచ్ చేసింది. వివో X300 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌ లతో పాటు విడుదలైన ఈ టాబ్లెట్ అద్భుతమైన డిస్‌ప్లే, అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రొఫెషనల్ వర్క్ చేసే వారికి, గేమర్లకు, ఎంటర్టైన్మెంట్ ప్రియులకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.

4K డిస్‌ప్లే & ఆడియో:
ఈ టాబ్లెట్ 13.2 అంగుళాల భారీ 4K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 347 PPI పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. కళ్లకు రక్షణగా TÜV సర్టిఫైడ్ లో-బ్లూ లైట్, అడాప్టివ్ బ్రైట్‌నెస్, పేపర్ లైక్ డిస్‌ప్లే మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడియో పరంగా ఇది 8-స్పీకర్ల పనోరమిక్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉండి, వినియోగదారులకు థియేటర్ లాంటి అనుభూతిని అందిస్తుంది.

Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!

పెర్ఫార్మెన్స్:
పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా ఇందులో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను వాడింది వివో. గేమింగ్ కోసం ప్రత్యేకంగా ‘మాన్స్టర్ హైపర్‌ కోర్ ఇంజిన్’ను అందించారు. ఇది భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్‌ ను కూడా సునాయాసంగా రన్ చేస్తుంది. టాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు 71,446 mm² వైశాల్యం గల భారీ VC కూలింగ్ సిస్టమ్‌ ను ఇందులో ఏర్పాటు చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఏకంగా 13000mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 78 రోజుల స్టాండ్‌బై టైంను, సుమారు 16 గంటల వీడియో ప్లేబ్యాక్‌ ను అందిస్తుంది.

ఫీచర్లు & సాఫ్ట్‌వేర్:
ఈ టాబ్లెట్ OriginOS 6పై పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం ‘అటామిక్ వర్క్‌బెంచ్’ ఫీచర్ ద్వారా ఒకేసారి ఐదు యాప్‌ లను వాడుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కోసం ‘CapCut’ ప్రొఫెషనల్ ఎడిషన్, డిజైనర్ల కోసం ‘ZWCAD’ వంటి సాఫ్ట్‌వేర్‌ లకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడుగా వచ్చే వివో పెన్సిల్ 3, స్మార్ట్ టచ్ కీబోర్డు 6 ప్రో యాక్సెసరీస్ దీనిని ఒక మినీ లాప్‌టాప్‌లా మారుస్తాయి.

Hey Balwanth : ఓటీటీలోకి సుహాస్ ‘హే బలవంత్’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ధర:
vivo Pad6 Pro పర్పుల్, బ్లూ, గ్రే అనే మూడు రంగుల్లో లభిస్తుంది. దీని ధరలు ఇలా ఉన్నాయి:
* 8GB + 256GB: 4,499 యువాన్ (రూ. 61,500)
* 12GB + 256GB: 4,999 యువాన్ (రూ. 68,340)
* 12GB + 512GB: 5,799 యువాన్ (రూ. 79,275)
* 16GB + 512GB: 6,699 యువాన్ (రూ. 91,572)
చైనాలో ఏప్రిల్ 3 నుండి వీటి అధికారిక విక్రయాలు ప్రారంభం కానున్నాయి. గ్లోబల్ మార్కెట్, భారత మార్కెట్లోకి ఈ టాబ్లెట్ ఎప్పుడు వస్తుందనే దానిపై వివో త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.