Reading Time: < 1 minute
Ap Govt Launches Swarnandhra Population Management Program With Monthly Health Camps

CM Chandrababu: మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంజీవని ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో సమర్ధవంతంగా అమలవుతోన్న ప్రాజెక్టును జూలై కల్లా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు సీఎం నిర్దేశించారు.

Read Also: SVC 63: బాక్సాఫీస్ షేక్ అయ్యే ‘మెగా’ అప్‌డేట్: సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్

వైద్య పరీక్షల ఫలితాలను వాట్సాప్‌ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. అయితే, ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూన్సిట్ అవసరం కానున్నాయని, రూ.162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు వివరించగా… ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేసుకున్నారని అధికారులు వివరించారు. మరో వైపు వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గేలా సేవలు అందించగలగాలని, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి తప్పనిసరిగా అనుసరించడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఏమేరకు మెరుగయ్యిందో పరిశీలించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..