Reading Time: 2 minutes

SKN ట్విస్ట్: తప్పుగా మాట్లాడాను..క్షమించండి.. పెద్ది వాయిదాపై SKN క్లారిటీ

Caption of Image.

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ రిలీజ్ వాయిదాపై చేసిన వ్యాఖ్యలపై బేబి నిర్మాత ఎస్‌కెఎన్ (SKN) క్షమాపణలు తెలిపారు. చెన్నై లవ్ స్టోరీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన పెద్ది, జూన్ 25న థియేటర్లోకి వస్తుందని SKN చెప్పారు.ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవ్వడంతో, SKN వీడియో రిలీజ్ చేసి  క్లారిటీ ఇచ్చారు. 

‘క్షమించండి’ నా కామెంట్స్‌ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ‘పెద్ది’ విడుదల వాయిదాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నేనే తప్పుగా అర్ధం చేసుకుని మాట్లాడాను. పెద్ది రిలీజ్ వాయిదాపై మేకర్స్ ద్వారా మాత్రమే అప్డేట్ వస్తుందని.. ఈ మిస్‌ కమ్యూనికేషన్‌కు నేను నిజంగా క్షమాపణలు కోరుతున్నానని SKN పేర్కొన్నారు.

ఈవెంట్లో SKN మాట్లాడుతూ ‘‘మా సినిమాను జూన్ 26 అనుకున్నాం కానీ ఆ సమయంలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వస్తోందని ఇప్పుడే తెలిసింది. కాబట్టి, మా సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం’’ అని అనడంతో పెద్ది వాయిదాపై రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ‘పెద్ది’ వాయిదా పడుతుందని వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.

►ALSO READ | హనీ రోజ్ ఘటన: ఇది అభిమానమా? అరాచకమా.. సెల్ఫీల కోసం ఎక్కడైనా చేయ్యేస్తారా?

అయితే, పెద్ది వాయిదా విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అలాంటిది అలా ఎలా పోస్ట్ పోన్ అవుతుందని అనౌన్స్ చేస్తారు? అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ SKN సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

అయితే, తాను ఎలా అర్ధం చేసుకున్నానో SKN వివరిస్తూ..‘‘అందరూ ‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడుగుతుండగా, మా రైటర్ & కో-ప్రొడ్యూసర్ సాయి రాజేష్‌ను అడిగాను. ఆయన చెబుతూ ‘ఇప్పుడే ట్వీట్స్ చూస్తున్నాను, జూన్ 25న పెద్ది రిలీజ్ అని డేట్ వైరల్ అవుతుంది, వాళ్లు అధికారికంగా ప్రకటించే వరకు ఏ రిలీజ్ డేట్ చెప్పకు’ అని చెప్పారు. కానీ, నేనే తప్పుగా అర్థం చేసుకుని ఆడియన్స్ ఉత్సాహం కారణంగా పొరపాటున నోరు జారాను.

ఒకవేళ పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారేమో, జూన్ 26ని అనుకున్నాం, కానీ ఆ సినిమా ఉంది కాబట్టి మా సినిమా రిలీజ్ అవ్వదు’ అని చెప్పాను. ఇక ఈవెంట్ కంప్లీట్ అయ్యాకనే నిజం తెలిసింది. కాబట్టి నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ మిస్‌ కమ్యూనికేషన్‌కు నేను నిజంగా క్షమాపణలు కోరుతున్నాను” అని ఎస్‌కెఎన్ (SKN) తన వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఇక ఈ వీడియోతో పెద్ది రిలీజ్ వాయిదాపై సినీ అభిమానులకి క్లారిటీ వచ్చేసేంది. 

©️ VIL Media Pvt Ltd.