Reading Time: < 1 minute

వడదోర: విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగుల చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ పలు రికార్డులు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 28 వేల పరుగులు చేసి రెండో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. విరాట్ 624, సచిన్ 644, సంగక్కర్ 666 ఇన్నింగ్స్‌లలో 28 వేల పరుగులు పూర్తి చేశారు. అన్ని ఫార్మాట్లలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో తొలి స్థానంలో ఉండగా వరసగా విరాట్ కోహ్లీ(28,068), సంగక్కర(28,016), రికీ పాంటింగ్(27,483), జయవర్దనే(25,957), జాక్వస్ కలిస్(25,534), రాహుల్ ద్రావిడ్(24,208), బ్రియన్ లారా(22,358), జోయ్ రూట్(22,166), జయ సూర్య(21,032) పరుగులతో ఉన్నారు