హైదరాబాద్: మెహిదీపట్నంలో పివి ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగంతో పాటు మంచు ఎక్కువగా ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెంటనే కారును పిఎస్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.