Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా పూడిమడకలో దారుణం జరిగింది. సొంత అన్నను చెల్లి రాయితో కొట్టి చంపింది. ఇంటి స్థలం కోసం అన్న నూకరాజు, చెల్లి కోర్లమ్మ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అగ్రహంతో రగిలిపోయిన చెల్లి అన్నను రాయితో కొట్టడంతో స్పృహతప్పిపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. నూకరాజు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.