Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్య‌క‌ర్త‌పై దాడి జరిగింది. వైసిపి కార్యకర్త మంద సల్మాన్ పై టిడిపి నాయకుడు మోటమర్రి పేతురు కర్రలతో దాడి చేశారని బాధితుడు కుటుంబ సభ్యుల ఆరోపణలు చేశారు. వెంటనే మంద సల్మాన్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంద సాల్మన్ తలకు తీవ్ర గాయాల అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సాల్మన్ ను పిడుగురాళ్లలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాలలో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మంద సల్మాన్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. టిడిపి కార్యకర్తలు అరాచకాలకు అడ్డుఅదుపులేకుండాపోయిందని వాపోతున్నారు.