
డమస్కస్: సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు చేస్తుంది. ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో అమెరికా దాడులు దిగుతోంది. గత నెలలో ఐసిస్ దాడుల్లో ఇద్దరు అమెరికన్ సైనికులు మృతి చెందడంతో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుంది. సిరియాలో ఐసిసి తీవ్రవాదుల స్థావరాలపై శనివారం ఉదయం అమెరికా వైమానికి దళం దాడులకు పాల్పడుతోంది. నెల వ్యవధిలో అమెరికా సైనికులు సిరియాపై దాడి చేయడం ఇది రెండోసారి. గతంలో చేసిన దాడిలో ఐసిసి సంబంధించిన 70 స్థావరాలను ధ్వంసం చేశారు. అమెరికా సైనికులకు ఎవరు హాని చేసిన వదిలిపెట్టమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.