Reading Time: < 1 minute

రాయ్ పూర్: పోలీస్ జీపు డ్రైవర్ మరో నలుగురితో కలిసి ఓ యువతి సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంగిమోంగా ప్రాంతంలో ఓ యువకుడి, యువతి(20) నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడి నలుగురు ఉన్నారు. ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేయడంతో సృహకోల్పోయింది. మెలుకువ వచ్చిన ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపడంతో వెంటనే ఆస్పత్రి తీసకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సివిల్ లైన్ పోలీసులు జీరోఎఫ్ఐఆర్ నమోదు చేసి బంకీమోంగ్రా పోలీస్ స్టేషన్ కు కేసు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇంకా ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.