
ఈ ఏడాది సంక్రాంతికి విజయ్ నటించిన ఆయన కెరీర్‌లో చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ కారణాలతో ఆ సినిమా వాయిదాపడింది. దీంతో తమిళం నుంచి కేవలం శివ కార్తీకేయన్ ‘పరాశక్తి’ మాత్రమే పొంగల్ బరిలో ఉందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఓ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చింది. అదే కార్తీ నటించిన ‘వా వాతియార్’ తెలుగులో ‘అన్నగారు వస్తారు’. వాస్తవానికి ఈ సినిమా గతేడాది డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆర్థిక కారణాలతో విడుదల వాయిదా పడింది.
ఇప్పుడు పొంగల్ రేసు నుంచి ‘జన నాయగన్’ తప్పుకోవడంతో వా వాతియర్‌ను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తమిళ వెర్షెన్ మాత్రమే ఈ తేదీన విడుదల అవుతుందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌కు ఇక్కడ థియేటర్లు దొరకడం కష్టం కావడంతో ఈ సినిమాను తెలుగు తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కామెడీతో పాటు యాక్షన్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.