
సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్న కేసులో రిమాండ్‌లో ఉన్న అంబర్‌పేట్ పిఎస్ ఎస్సై భానుప్రకాష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. భానుప్రకాష్ రెడ్డి సర్వీస్ రివాల్వర్‌ను పోగొట్టుకోవడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న అంబర్‌పేట్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. భానుప్రకాష్ ఓ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని కుదువబెట్టుకోవడంతో అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే విచారించేందుకు పోలీసులు భానుప్రకాష్‌ను అరెస్టు చేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న భానుప్రకాష్ రెడ్డిని అంబర్‌పేట్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. ఎస్సై భాను ప్రకాశ్‌రెడ్డి నుంచి బెట్టింగ్‌లకు బానిసవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో నేరాల బాటపట్టాడు.
భాను ప్రకాశ్‌రెడ్డి బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై విచారణ చేసిన పోలీసులు వాటిని తాకట్టు పెట్టినట్లు గుర్తించారు.పోలీసుల విచారణలో ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పారు. గన్ మిస్సింగ్ గురించి అధికారులు ప్రశ్నించినప్పుడు భానుప్రకాశ్‌రెడ్డి పలు రకాల స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలిసింది, ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ విచారించినా కూడా భానుప్రకాష్ అసలు విషయం చెప్పనట్లు తెలిసింది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో రివాల్వర్ పోయిందని అధికారులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అసలు విషయం చెప్పకపోవడంతో పోలీసులు భానుప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.