Reading Time: < 1 minute

అమరావతి: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి విబేధాలపై ఆయన మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాల సద్వినియోగంతో రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని అన్నారు. కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమలసాగర్‌కు ఎందుకు అని అడిగారు. తెలుగు ప్రజల కోసం ఒకరికొకరు సహకరించుకుంటాం అని తెలిపారు. ప్రజల కోసం ప్రాజెక్టులు చేపడతాం కానీ, జగన్ కోసం నేనెందుకు చేస్తా? అని అన్నారు.

‘‘నీటిని లిఫ్ట్ చేస్తే ఎక్కడైనా దాచుకోవచ్చు.. అవసరాలకు వాడుకోవచ్చు. నల్లమలపాగర్ మేము చేపడితే శ్రీశైలం, సాగర్‌లో నీటి లభ్యత పెరుగుతుంది. శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చు. 2020లో నిలిపిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. ఎపి ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ పడేదే లేదు’’ అని చంద్రబాబు అన్నారు.