
మియాపూర్ హైడ్రా శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా కీర లింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేట సర్వే సంబరు 44లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 3 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా, అదే సర్వే నంబరు 44లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గుర అవుతోందని హైడ్రాకు గతంలో వచ్చిన పిర్యాదుల మేరకు గతేడాది డిసెంబరు 8వ తేదీన 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను తొలగించింది. మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి అనుకుని 200ల మీటర్ల మేర ఉన్న 18 పిట్టర్లను హైడ్రా గతంలోనే తొలగించింది. తాజాగా అదే సర్వే నంబరు 44లో 15 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకుంది.
నేకులతో హద్దులను నిర్ణయించి అక్రమణలకు సాల్పడగా.. వాటిని తొలగించి హైడ్రా విన్సింగ్ చేసింది. సర్వే నంబరు 44లోని ప్రభుత్వ భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు.. సంబంధిత సబ్ రిజిష్టార్ సస్సెన్షన్ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబందిత శాఖల అధికారులతో హైడ్రా పరిశీలించింది. ఆక్రమణలను నిర్ధారించుకుంది, హైడ్రాకమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు శనివారం 15 ఎకరాల మేర అక్రమణలను తొలగించి హైడ్రా పెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. 159 సర్వే నంబర్కు సంబంధించిన పత్రాలతో సర్వే నంబర్ 44లోని ఎకరన్నర వరకూ కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికి కేసు నమోదయ్యింది.