Reading Time: < 1 minute

టీం ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏ టోర్నమెంట్ అయినా చెలరేగపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. అండర్-19 ప్రపంకప్-2026లో భాగంగా స్కాట్‌లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. దాదాపు 192 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్, మొత్తంగా 50 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 96 పరుగులు చేశాడు. అతడు సాధించిన ఈ స్కోర్‌లో 78 పరుగులు బౌండరీల ద్వారానే రావడం గమనార్హం. వైభవ్‌తో పాటు ఆరోన్ జార్జ్‌ కూడా 61 పరుగులతో రాణించాడు.