Reading Time: < 1 minute

మరికొన్ని రోజుల్లో ఐసిసి టి-20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి భారత్, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. అయితే ఈ టోర్నమెంట్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్‌కు చోటు దక్కలేదు. అతడి వైస్ కెప్టెన్సీ కూడా తిరిగి అక్షర్ పటేల్ చేతిలోకి వెళ్లిపోయింది. పొట్టి ఫార్మాట్‌లో గిల్ వరుసగా విఫలం కావడమే ఇందుకు కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనకు జట్టులో చోటు దక్కకపోవడంపై గిల్ తొలిసారి స్పందించాడు.

‘‘నేను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తాను. టి-20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీం ఇండియాకు ఆల్ ది బెస్ట్. నేను ఉండాల్సిన చోటే ఉన్నాను. అలాగే నా విధిలో ఉన్నదాన్ని ఎవరకూ తీసుకోలేరు. దేశం కోసం తన శాయశక్తులా ప్రయత్నించాలని ప్రతి ఆటగాడు ఆశిస్తాడు. సెలక్టర్లు వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకున్నారు’’ అని గిల్ అన్నాడు. ఇక తన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి కూడా గిల్ మాట్లాడాడు. ‘‘ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ, గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్ విరాట్ భాయ్ జట్టులో ఉంటే.. కెప్టెన్ పని తేలికవుతుంది. కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరిద్దరి సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడతాయి’’ అని గిల్ అన్నాడు.