
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ.. వాటిని సవాల్ చేస్తూ.. ఈ సినిమాను జనవరి 14వ తేదీ సాయంత్రం 5.49 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆ నారీ.. ఈ నారీ’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇద్దరు హీరోయల్‌లతో కలిసి శర్వా ఈ సాంగ్‌లో స్టెప్పులేశాడు. ఇద్దరి మధ్య ఎలా నలిగిపోయాడో ఈ పాటలో చూపించారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. అరవింద్ ఆలపించాడు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ పాటకి హైలైట్. ఇక ఈ సినిమాకి ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా.. రామబ్రహ్మం సుంకర నిర్మించారు.