
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్-2026 ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కి తెరలేచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డ్‌లో ఆగ్రహానికి గురి అయ్యే పరిస్థితి చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ, నిన్నటి మ్యాచ్‌లో ఆమెకు ఓ కెమెరామెన్ చిరాకు తెప్పించాడు.
స్మృతి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడు ఆమెకు చాలా దగ్గరకు వెళ్లి షూటింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో విసుగు చెందిన స్మృతి ‘ఏంటిది’ అంటూ ప్రశ్నించింది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ముంబైని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు జట్టు నదైన్ (63) రాణించడంతో ఆఖరి బంతివరకూ పోరాడి 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
Cameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw
— RCB (@RCBtweetzz) January 9, 2026