Reading Time: < 1 minute

చార్మింగ్ స్టార్ శర్వా.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ A movie that everyone will enjoyఇది. నేను తీసిన వివాహ భోజనంబు, సామజవరగమన, ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరూ కలిసి హాయిగా చూసి ఎంజాయ్ చేసేలా వుంటుంది. ఈ సినిమాలో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. అది బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. – శర్వా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లో అదరగొట్టేస్తారు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు.. తర్వాత ఆయన చేసిన ఎంటర్‌టైనర్ ఇది. ఆయన చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. సినిమాలో హీరోయిన్లు సంయుక్త, వైద్య ఇద్దరికీ కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వున్నాయి. శ్రీవిష్ణుకు -ఈ సినిమాలో ఒక మంచి కామియో రోల్ వుంది. ఆయన అడిగిన వెంటనే నచ్చి చేశారు. నా నెక్స్ సినిమా శ్రీ విష్ణుతో చేస్తున్నాను. అది క్రైమ్ కామెడీ జోనర్‌”అని అన్నారు.