Reading Time: < 1 minute

హైదరాబాద్: మాంజా తగిలి ఓ వ్యక్తి గొంతు కోసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో జరిగింది. అంబర్‌పేట కొత్త ఫ్లైఓవర్ మీద ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తున్నాడు. మాంజా అతడి మెడకు తగలడంతో కోసుకొని రక్తస్రావం అయ్యింది. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను వాడడం ఇకనైనా ఆపాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చైనా మాంజాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కూడా భాగ్యనగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓల్డ్ మిర్జాల్‌గూడలో మాంజాను లాగడంతో 33 కెవి కరెంట్ తీగ తెగిన విషయం తెలిసిందే. మాంజాలకు చిక్కుకొని పావురాలు ప్రాణాలుపోతున్నాయి.