Reading Time: < 1 minute

ఎపిలోని అన్నమయ్య జిల్లా రాయచోటీ పట్టణం గాలివీడు రింగ్ రోడ్డు కూడలిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న కంటైనర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగాయి. కంటైనర్‌కు మంటలు వ్యాపించడంతో ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు శ్రీనివాసులు (48) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మదనపల్లి వైపు నుంచి కంటైనర్ ఇనుప సామాగ్రితో కడపకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కర్నూలులో జరిగిన బస్పు ప్రమాద ఘటన తరహాలోనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు వెల్లడించారు.