Reading Time: < 1 minute

హైదరాబాద్‌: చైల్డ్‌ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 18 బృందాలతో ఈ ఆపరేషన్ జరిగింది. చైల్డ్ పోర్న్ చూస్తూ, షేర్ చేస్తూ, అప్‌లోడ్ చేస్తున్న 24 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో అత్యధికులు హైదరాబాద్‌లో ఉండే యువకులుగా గుర్తించారు. నిందితుల్లో నీటిపారుదల శాఖ ప్రభ్వుత ఉద్యోగి కూడా ఉన్నాడు. నిందితుల్లో ఎక్కువ మంది 18 నుంచి 48 ఏళ్ల వయసు వారిగా గుర్తించారు. ఆపరేషన్‌లో 10 మంది మ్యూల్ ఖాతాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పలు సైబర్ మోసాలకు సహకరించినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 37 సైబర్ క్రైమ్ కేసుల్లో లింకులు ఉన్నట్లు తెలిసింది. రూ.26 కోట్ల లావాదేవీలు మ్యూల్ ఖాతాల్లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. డీప్, డార్క్‌ వెబ్‌పై నిరంతర నిఘా ఉంచినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు స్ఫష్టం చేశారు.