Reading Time: < 1 minute
Union Budget 2026 Live Updates Nirmala Sitharaman

Union Budget 2026 live Updates: నేడు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశం మొత్తం ఢిల్లీలోని పార్లమెంట్‌ వైపు చూస్తోంది. ఈ బడ్జెట్‌పై అంచనాలు చాలా ఉన్నాయి. జీతం పొందే ఉద్యోగులు ట్యాక్స్ తగ్గింపులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ ఖర్చులు కొంచెం తేలిక అవుతాయా? అని ఆశిస్తున్నారు. గ్రామాలు, రైతులు తమకు మళ్లీ ప్రాధాన్యం దక్కుతుందా? అని చూస్తున్నారు. మరోవైపు.. పెట్టుబడిదారులు మాత్రం ప్రభుత్వం వృద్ధి (గ్రోత్) ఆర్థిక క్రమశిక్షణ మధ్య ఎలా సమతుల్యం చేస్తుందో గమనిస్తున్నారు. ప్రపంచం మొత్తం మాత్రం అనిశ్చితిలో ఉంది. అమెరికా టారిఫ్ విధానాలు, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఇవన్నీ గ్లోబల్ ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలా ముందుకు సాగుతుంది అన్నదే కీలక ప్రశ్న. ఈసారి ట్యాక్స్ స్లాబ్‌ల్లో మార్పులు ఉంటాయా? మధ్యతరగతికి నిజంగా ఊరట దక్కుతుందా? యువతకు కొత్త ఉద్యోగాలు సృష్టించేలా ప్రభుత్వం ఏమి చేస్తుంది? రోడ్లు, రైల్వేలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై మళ్లీ భారీ ఖర్చు ఉంటుందా? లేదా గ్రామీణ ఖర్చులు పెంచి రైతులు, కూలీల చేతిలో డబ్బు పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఈ అన్ని ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం లభిస్తుంది. ఈ బడ్జెట్ ఎన్టీవీ లైవ్‌ అప్డెట్స్ మీకోసం..