Reading Time: < 1 minute

ముంబయి: మహారాష్ట్రలో జరిగిన విమానం ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు.  బుధవారం 8.45 నిమిషాలకు పుణె జిల్లాలోని బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఆరుగురు మృతి చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం పవార్ ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్నవారు సజీవదహనమయ్యారు.