
ఆసియాలోనే అతి పెద్దదైన కేరళ లిటరరీ ఫెస్టివల్ (కేఎల్‌ఎఫ్ )కోజికోడ్ సముద్ర తీరాన గురువారం నాడు ప్రారంభం అయింది . 25 వ తేదీ వరకు నా లుగు రోజుల పాటు జరిగే ఈ సాహిత్య ఉత్సవాలను వ్యోమ గామి సునీత విలియమ్స్, స్ప్రింటర్ బెన్ జాన్సన్ , ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ , నటి భావన తదితరులు ప్రారంభించారు. తొలి రోజు ఉదయం నుండే వివిధ అంశా ల మీద సదస్సులు కొనసాగుతున్నప్పటికీ, అధికారిక ప్రారంభోత్సవం సాయంత్రం 6 గంటలకు జ రిగింది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సు నీతా విలియమ్స్ ప్రారంభోత్సవం లో మాట్లాడు తూ ఈ సాహిత్యోత్సవానికి హాజరయిన సాహిత్యకారులను, సాహిత్యాభిమానులను చూ స్తూ ఉంటే అంతరిక్షంలో నక్షత్రాలను చూసిన సంతోషం కలుగుతుందన్నారు. ప్రకాష్ రాజ్ మా ట్లాడుతూ ఆ కాశంలో చుక్కల మధ్య విహరించిన అంతరిక్షం లో ల్యాండ్ అయిన సునీతా విలియ మ్స్‌ను చూడ టం ఎంతో స్పూర్తి కలిగిస్తూ ఉంది. అక్కడ లాండ్ అయిన ఆమె ఇక్కడ ఈ కెఎల్‌ఎఫ్ లో లాండ్ అవుతుందని నేను ఊహించలేదు. ఇక్కడకు ఆమె రావడం అద్భుతం. ఈ ఫెస్టివల్ కి వచ్చి న నటి భావన మనందరికీ స్ఫూర్తి ఫైటర్ అన్నారు .
ప్రముఖ స్ప్రింటర్ బెన్ జాన్సన్ ఈ సాహిత్య సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కోజికోడు మేయర్ సదాశివన్, ఫెస్టివల్ డైరెక్టర్ కె. సచ్చితానందన్, ప్రముఖ అంతరిక్ష యాత్రికురాలు సునీత విలియమ్స్, సినీ నటులు భావన, ప్రకాష్ రాజ్ , సన్నాహక కమిటీ చైర్మన్ ఎ. ప్రదీప్ కుమార్, మంత్రులు మొహమ్మద్ రియాస్, పలనివర్ తంగ రాజన్ , గోధే జంత్రం దక్షిణాసియా డైరెక్టర్ డాక్టర్. మార్లా స్టుకెన్ బెర్గ్ తదితరులు పాల్గొన్నారు. హెరిటేజ్ ప్రాంతంగా యునెస్కో భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా గుర్తించిన పోర్ట్ సిటీ, కోజికోడులోని అరేబియా సముద్ర తీరపు ఇసుకతిన్నెల వద్ద జరుగుతున్న ఈ సాహిత్య పండుగకు, దేశ విదేశాల నుండి సుమారు ఐదు లక్షల మంది సాహిత్యం పట్ల అభిలాష ఉన్న ప్రతినిధులు హాజరవుతారని ఒక అంచనా. ఈ కెఎల్‌ఎఫ్. 8వ ఎడిషన్ భారీ సాహిత్య ఫెస్టివల్ కు ప్రముఖ కవి సాహితీ విమర్శకులు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీకి , ప్రస్తుతం కేరళ సాహిత్య అకాడమీకి డైరెక్టర్ గా వున్న ప్రొఫెసర్ కె . సచ్చిదానందన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.రచయితలు, కళాకారులు, ఫిలిం మేకర్స్,చిత్రకారులు, మేధావులు, సైంటిస్ట్ లు, సినీ నటులు ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు.మూడు వందల సెషన్లు సమాంతరంగా ఈ నాలుగు రోజులపాటు జరుగుతాయి.
దేశ విదేశాల నుండి వచ్చిన 500 మంది వక్తలు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు.డిసెంబర్, జనవరి మాసాలు దేశవ్యాప్తంగా సృజన కారుల పండుగ రోజులు. నాట్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళ, సాహిత్యం వంటి అనేక సృజన రంగాల లో నిష్ణాతులైన వారు భాగస్వాములయ్యే అనేక ఫెస్టివల్స్ తో దేశం అంతా కళకళలాడుతూ ఉంటుంది. పూణే, కలకత్తాల్లో అలాగే ఇటీవలే చెన్నైలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన, హిందూ లిటరరీ ఫెస్టివల్స్ జరిగాయి. ప్రసిద్ధి చెందిన జైపూర్ లిటరి ఫెస్టివల్ కూడా ఇటీవలే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదులో జనవరి 22 నుంచి 25 వరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్‌ఎల్‌ఎఫ్) జరుగుతున్నది. ఆసియాలోనే అతి పెద్దదైన కె ఎల్ ఎఫ్ .పండుగకు జర్మనీని అతిథి దేశంగా ఆహ్వానించారు. కేఎల్‌ఎఫ్ ప్రాంగణంలోనే జర్మనీ పెవీలియన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా సికెఎల్‌ఎఫ్ పేరుతో కె ఎల్ ఎఫ్ ప్రాంగణంలోనే ప్రత్యెక ఏర్పాటు చేశారు. రచయితలతో సంభాషణలు, సమావేశాలు, సాంసృ్కతిక ప్రదర్శనలు, థియేటర్, సంగీతం, పుస్తక ప్రదర్శనలు, వంటి వాటి కోసం కూడా ప్రత్యేక హాల్స్ ఏర్పాటు చేశారు. 8 ప్రధానమైన ప్రాంగణాలలో సమావేశాలు జరుగుతున్నాయి. అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నా యి.18 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు సాహిత్యము, అస్తిత్వం ,అనువాదాలు, పర్యావరణ, మానవ హక్కులు ,ఆర్కిటెక్చర్, సినిమా, ఆటలు, సైబర్ సెక్యూరిటీ ,పబ్లిక్ పాలసీ వంటి అనేక విషయాల పైన ప్రసంగించనున్నారు.
సునీత విలియమ్స్, కిరణ్ దేశాయ్ , అబ్దుల్ రజాక్, అభిజిత్ బెనర్జీ, గుర్నాహ్, పీకో అయ్యర్, బెన్ జాన్సన్, జిమ్మీ వాల్స్ , కిరణ్ దేశాయ్, రొమిల్లా థాపర్ వంటి ప్రముఖులు ఈ నాలుగు రోజుల సాహిత్యోత్సవం లో పాల్గొంటున్నారు. ప్రతినిధులతో కిక్కిరిసిన ప్రధాన హాల్లో మొదటి రోజు ఉదయం ప్రముఖ నటుడు, ఆలోచనపరుడు ప్రకాష్ రాజ్ అసమ్మతి ని నేరం గా పరిగణించడం (Criminalising Dissent! Who Gets LOCKED Up for Speaking Out ?) అనే అంశంపై కాన్‌ఫ్లూయెన్స్ మీడియా సిఈవో జొసీ జోసెఫ్ తో సంభాషించారు.ప్రజాస్వామిక హక్కులపై, భిన్నాభిప్రాయ పై, బహుళత్వంపై జరుగుతున్న దాడులు, నిర్బంధం గురించి, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనం గురించి వారు మాట్లాడారు. చివరగా పౌరసత్వ ఆందోళనలో ఎంతో ప్రాచుర్యం పొందిన హమ్ యాద్ రఖేంగే కవితతో ఆయన ప్రసంగాన్ని ముగించారు.కె . సచ్చిదానందన్,గీతా హరిహరన్ లు సంపాదకత్వం వహించిన సంకలనం The View from Hear: Storia And Poems OF Many Indiyans పుస్తకం పై సబితా సచ్చి ( కవి, సచ్చితానందన్ కూతురు) సంపాదకులు ఇద్దరితోనూ ఆసక్తికరమైన సంభాషణను నిర్వహించారు.వివిధ భాషలు, మతాలు, అస్తిత్వాలు,సంసృ్కతులలో జీవిస్తూ రాసిన రచనలను ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం ఈసంకలనం చేసిందని వారు అన్నారు.
దేశం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటుందని, మాట్లాడుతున్న వాళ్ళని ఇతరులు, బయటివారుగా పరిగణిస్తూ విమర్శిస్తున్నారని ,దేశాన్ని, ప్రజలని ప్రేమించడం వేరు నేషనలిజం పేట్రియాటిజం అనే పేరుతో జాతీయతను ఏకశిలా సదృశ్యకం చేయడం వేరని ఆయన అన్నారు. ఇండియా ఒకటే కానీ ఇండియన్స్ లో అనేక రకాల ఇండియన్లు ఉన్నారు అని గీతా హరిహరన్ చెప్పారు.దక్షిణాది భాషల పై కూడా ఒక సెషన్ జరిగింది. అనేక పుస్తకాలపై రచయితలతో విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి.ముఖ్య అతిథి దేశంగా జర్మన్ పెవిలియన్ లో కూడా అనేక అంశాలపై సమావేశాలు జరుగుతున్నాయి.డిప్లమసీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎఐ, రింబరింగ్ యాజ్ రెసిస్టెన్స్: హౌవ్ జర్మనీ తదితర అంశాలపై సమావేశాలతో పాటు, జర్మనీ థియేటర్ లో నాటికలు, అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి.కన్నడ, మలయాళ, తమిళ దక్షిణాది రచయితలు , బెంగాలీ, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, హిందీ, వంటి అనేక భాషల రచయితను కనపడుతున్నారు తప్ప మచ్చుకి ఒక్క తెలుగు రచయిత కూడా కనపడక పోవడం బాధాకరం. తెలుగు భాషకు కనీస ప్రాధాన్యత కూడా లేకపోవడం కొట్టోచ్చినట్టు కనిపిస్తున్న అంశం. ఈ సాహిత్య ,సాంసృ్కతిక సమ్మేళనం ఎల్లలను చెరిపివేసి, సాహిత్యకారులను కళాకారులను ఏకం చేస్తూ ఉంది.