Reading Time: < 1 minute

WPL 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబి), యూపి వారియర్స్ జట్ల మధ్య ఐదో లీగ్ మ్యాచ్ జరగుతోంది. నేవీ ముంబయి వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబి కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ కు దిగిన యూపికి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హర్లీన్ డియోల్(11)ను ఆర్సీబి బౌలర్ బెల్ పెవిలియన్ కు పంపింది. ప్రస్తుతం యూపి వారియర్స్ 6 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో ఫోబ్ లిచ్‌ఫీల్డ్(14), కెప్టెన్ లానింగ్(11)లు ఉన్నారు.

కాగా, మొదటి మ్యాచ్ లో ముంబయిపై ఆర్సీబి విజయం సాధించి.. టోర్నీలో బోణి కొట్టగా.. యూపి, గుజరాత్ జెయింట్స్ జట్టుతో జరిగి తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. వరుసగా రెండో విజయం సాధించి సత్తా చాటాలని ఆర్సీబి భావిస్తోంది. ఇక, ఈ మ్యాచ్ లో ఆర్సీబిని ఓడించి, టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు: గ్రేస్ హారిస్, స్మృతి మంధాన(సి), దయాళన్ హేమలత, గౌతమి నాయక్, రిచా ఘోష్(w), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.

యుపి వారియర్జ్ మహిళలు: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (సి), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (w), డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్.