
హైదరాబాద్: పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా సిజెఐ ప్రకటించింది. సిజెఐ రిట్ పిటిషన్ వల్ల పిటిషన్ కు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపింది. సూట్ దాఖలు చేస్తే అన్ని పరీవాహక అభిప్రాయాలు పరిగణనలోకి వస్తాయని సిజెఐ వివరించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కితీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సిజెఐ సూచన మేరకు పిటిషన్ ఉపసంహరించుకున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సిజెఐ సూచించారని పేర్కొన్నారు. ఆర్టికల్ 131 రూపంలో రావాలని సిజెఐ సూచించారని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపించామని తెలియజేశారు. కేటాయింపు కంటే నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశం అని.. ఎపి ప్రభుత్వ ఉల్లంఘనలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చామన్నారు. స్టాప్ వర్క్ ఆర్డర్ ను అమలు చేయట్లేదని కూడా కోర్టుకు చెప్పామని, గత డిజైన్ కు అదనంగా ఏమీ చేయడానికి వీల్లేదని వాదించామని ఉత్తమ్ కుమారు స్పష్టం చేశారు.