Reading Time: < 1 minute

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విజయోత్సాహంలో ఉన్న జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 ఓవర్ల పాటే బౌలింగ్ వేశాడు. అతడి బదులు ధృవ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో మాత్రం వాషింగ్టన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే అతడు తర్వాతి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా… లేదా? అనే విషయంపై స్పష్టత రావాలి.

వాషింగ్టన్ సుందర్ గాయం గురించి కెఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ‘‘సు్ందర్ గాయం తీవ్రత గురించి నాకు తెలియదు. మ్యాచ్‌లో అతడు బంతిని బాగానే కొట్టాడు. అతడు పరిగెత్తలేకపోతున్నాడని నాకు తెలియదు. మొదటి ఇన్నింగ్స్‌లో సుందర్ కాస్త ఇబ్బందికి గురయ్యాడని మాత్రం తెలుసు’’ అని రాహుల్ అన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో సుందర్ ఏడు బంతులు ఎదురుకొని 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.