Reading Time: < 1 minute

న్యూయార్క్: ఇరాన్ దేశంలో హింస ద్వారానే నాయకులు పరిపాలిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ దేశం పరిమితులు దాటినట్లుగా కనిపిస్తుందని, అమెరికా సైన్యం నిశితంగా గమనిస్తుందన్నారు. ఇరాన్ నాయకులు తనకు ఫోన్ చేశారని, వారితో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతుండడంతో బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇరాన్ నాయకులతో సమావేశానికి ముందే చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఇంటర్ నెట్ నిలిపివేతపై ట్రంప్ స్పందించారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో మాట్లాడి ఇంటర్‌నెట్ సేవలు పునరుద్దరిస్తామని చెప్పారు. ఇరాన్‌లో నిరనసకారులను పెద్ద ఎత్తున అణచివేస్తున్నారు. ఈ ఘర్ణణల్లో 496 మంది ఆందోళనకారులు, 48 భద్రతా సిబ్బంది చనిపోయారు. పది వేల మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘర్షణల్లో భారతీయులతో పాటు విదేశీయులు ఎవరు మరణించలేదని ఆ దేశాల రాయబార కార్యాలయాలు వెల్లడించాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌తో కలిసి యుద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికు ఇరాన్‌ పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.