
హైదరాబాద్: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన స్పందించింది. పొత్తులపై జాతీయ స్థాయిలో జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ దే నిర్ణయమని తెలంగాణ జనసేన ఇన్‌ఛార్జ్ శంకర్‌గౌడ్ తెలిపారు. బిజెపితో పొత్తు ఉంటుందా లేదా అనేది పవన్ నిర్ణయని తెలియజేశారు. పొత్తు ఉన్నా లేకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బలమున్న స్థానాల్లో తప్పకుండా బరిలో ఉంటామని చెప్పారు. మా టార్గెట్ 2028 అసెంబ్లీ ఎన్నికలేనని శంకర్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఒంటరిగా పోటీ చేస్తామని రాంచందర్ రావు తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధకారంలోకి రాబోతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.