Reading Time: < 1 minute

టీం ఇండియా, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30కి వడోదర వేదికగా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. టీం ఇండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్‌కి దూరమయ్యాడు. ఉదయ భాగంలో అతడికి గాయమైంది. ప్రస్తుతం పంత్ బిసిసిఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే రిషబ్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంపై నెలకొన్న సందిగ్ధతకు బిసిసిఐ ముగింపు పలికింది. పంత్ స్థానంలో యువ క్రికెటర్ ధృవ్ జురెల్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ రాణించడంతో అతడికి జట్టులో చోటు దక్కింది. మరి ధృవ్.. పంత్ స్థానాన్ని ఎంతవరకూ భర్తీ చేస్తాడో వేచి చూడాల్సిందే.