
హైదరాబాద్: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తొలి వన్డే మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపించడంలేదు. పంత్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి బలంగా తగడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తొలి వన్డేతో పాటు సిరీస్ నుంచి దూరంగా ఉండనున్నట్టు సమాచారం. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. బిసిసిఐ ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు. త్వరలో న్యూజిలాండ్‌తో ఆడే టి20 జట్టును కూడా ప్రకటించలేదు. తిలక్ వర్మ కూడా గాయపడడంతో న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు అందుబాటులో ఉండడంలేదు. తిలక్ వర్మ బదులు జట్టులోకి శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కావడంతో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.