Reading Time: < 1 minute

రాంఛీ: యాజమాని ప్రాణాలు కాపాడి శునకం పులితో పోరాడి చివరగా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనీతాల్ జిల్లా మదన్‌పుర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గైబువా అనే రక్షిత్ పాండే అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పైలట్ అనే జర్మన్ షెఫర్డ్ అనే శునకాన్ని పెంచుతున్నాడు. రక్షిత్ ఎక్కడికి వెళ్లి అతడి వెంటే శునకం ఉంటుంది. శునకంతో కలిసి సదరు రైతు తన చెరుకుతోటలోకి వెళ్లాడు. పెద్ద పులి ఒక్కసారిగా రైతుపై పడి దాడి చేసింది. వెంటనే శునకం పులితో పోరాటం చేసింది. వెంటనే రైతు అప్రమత్తమై పులి నుంచి తప్పించుకొని గ్రామంలోకి వెళ్లాడు. పులి పలుమార్లు పంజా విసరడంతో కుక్క చనిపోయింది. రైతు గ్రామస్థులతో కలిసి చెరకు తోటకు చేరుకున్నాడు. జర్మన్ షెఫర్డ్ శునకం అచేతనంగా పడిఉండడంతో యజమాని బోరున విలపించాడు. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిఎఫ్‌ఓ ప్రకాశ్ చంద్ర ఆర్య అక్కడికి చేరుకొని చుట్టు ప్రక్కల గ్రామాలలో బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అతి త్వరలో పులిని పట్టుకుంటామని స్పష్టంచేశారు.