Reading Time: 2 minutes

కెమిస్ట్రీ ఒలింపియాడ్ లో స్వర్ణం.. JEE అడ్వాన్స్ లో 5వ ర్యాంక్ సాధించిన నారాయణ స్కూల్ విద్యార్థి కూచి సందీప్

Caption of Image.

విశాఖపట్నంకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి కూచి సందీప్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ -2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సాధించిన సందీప్, అంతకుముందు జేఈఈ మెయిన్ 2026 లో 37వ ర్యాంక్ పొంది తన విజయపరంపరను చాటుకున్నాడు. దీనికితోడు, అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ (IChO) పోటీలలో వరుసగా రెండేళ్లు స్వర్ణ పతకాలు సాధించి భారతదేశ కీర్తిపతాకాన్ని విశ్వవేదికపై ఎగురవేశాడు. 2025లో దుబాయ్ (యుఏఈ) లో జరిగిన 57వ IChO, 2026 లో తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)లో జరిగిన 58వ ICHO పోటీలలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి సందీప్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. 58వ ICHO పోటీలో పాల్గొన్న నలుగురు సభ్యుల భారత జట్టులోని సభ్యులందరూ స్వర్ణ పతకాలు సాధించగా, ఈసారి అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ చరిత్రలోనే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా చేసింది.

విద్యా ప్రయాణం & విద్యాసంస్థల తోడ్పాటు

నారాయణ ఈ-టెక్నో స్కూల్ సందీప్ తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తొమ్మిదో తరగతిలోనే జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో పాల్గొనడం ప్రారంభించిన సందీప్, 11వ తరగతి నుంచి ఒకవైపు ఒలింపియాడ్ శిక్షణ పొందుతూనే జేఈఈ పరీక్షలకు ప్రత్యేక సన్నాహాలు ప్రారంభించాడు. తన సక్సెస్ సీక్రెట్ గురించి సందీప్ మాట్లాడుతూ “కాన్సెప్టులపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం, క్రమం తప్పకుండా మాక్ టెక్స్ట్ రాయడం , నిరంతర రివిజన్ చేయడమే నా విజయానికి పునాది. ప్రాక్టీస్ టెస్టుల్లో చేసిన పొరపాట్లను విశ్లేషించుకుని సరిదిద్దుకోవడం ద్వారా నా పనితీరు మెరుగైంది. కాన్సెప్టుల పునఃశ్చరణకు, అసెస్మెంట్ల ప్రాక్టీస్ల కోసం స్కూల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘ఎన్లెర్న్’ (nLeam) ఎంతో ఉపయోగపడింది” అని తెలిపారు. పోటీ పరీక్షల ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు నారాయణ విద్యాసంస్థల మానసిక ఆరోగ్య కార్యక్రమం ‘దిశ’ (DISHA) ద్వారా నిపుణులైన సైకాలజిస్ట్ల కౌన్సెలింగ్ సహాయపడిందని వివరించాడు. సందీప్ విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఎన కనెక్ట్’ (nConnect) యాప్ ద్వారా తోడ్పాటు లభించిందని, ఉపాధ్యాయులు , మెంటార్ల ప్రోత్సాహం వల్లే సందీప్ నిరంతరం చదువుపై దృష్టి పెట్టగలిగాదని ఆయన తల్లిదండ్రులు పేర్కొన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు & విద్యార్థులకు సూచనలు

సందీప్ ప్రస్తుతం ఐఐటీ ముంబాయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఏఐ , ఆటోమేషన్ వల్ల రోజువారీ పనులు మారినప్పటికీ, మానవ సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన మరియు శాస్త్రీయ పరిశోధనలకు భవిష్యత్తు సాంకేతికత రంగంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని సందీప్ వ్యాఖ్యానించాడు. కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న తోటి విద్యార్థులకు సందీప్ కొన్ని సూచనలు చేశారు. రోజువారీ ప్రిపరేషన్లో స్థిరత్వం పాటించాలని, కాన్సెప్టులను అర్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని, ప్రాక్టీస్ టెస్టుల తప్పుల నుండి నిరంతరం నేర్చుకోవాలని సూచించాడు.

 

©️ VIL Media Pvt Ltd.