
టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్విజ్ షో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ (KBC). ప్రస్తుతం 18వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, ప్రీతీ జింటాతో పాటు స్టార్ హీరో కం నిర్మాత ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎప్పటిలాగే హోస్ట్ అమితాబ్ బచ్చన్ తనదైన హాస్యంతో ఎపిసోడ్‌ను సందడిగా మార్చారు. ఈ సందర్భంగా ప్రీతీ జింటాను అమితాబ్ బచ్చన్ సరదాగా ఆటపట్టించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రీతీకి ప్రతిసారి మెసేజ్ చేస్తానని, కానీ ఆమె మాత్రం తనకు ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు.
మెసేజ్‌కు రిప్లై ఎందుకు ఇవ్వలేదు?
తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) షో వేదికగా బిగ్ బీ షేర్ చేసిన ఒక ఫన్నీ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ సందర్భంగా ప్రీతీ జింటాను అమితాబ్ బచ్చన్ సరదాగా ఆటపట్టించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రీతీకి ప్రతిసారి మెసేజ్ చేస్తానని, కానీ ఆమె మాత్రం తనకు ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు.
“మీపై మాకు ఒక కంప్లైంట్ ఉంది. ప్రతి జనవరి 31న మీకు (ప్రీతీ జింటా) పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాను. కానీ మీరు ఒక్కసారి కూడా నాకు రిప్లై ఇవ్వలేదు” అంటూ అమితాబ్ అన్నారు. దీనికి ప్రీతీ జింటా వెంటనే స్పందిస్తూ.. “లేదు అమిత్‌జీ.. అలా కాదు. నేను మీకు రిప్లై ఇస్తాను. కానీ మీ మెసేజ్ వచ్చిన వారం తర్వాత ఇస్తాను” అంటూ నవ్వులు పూయించారు.
చాట్ స్క్రీన్‌షాట్ చూపించిన అమితాబ్..
అమితాబ్ ఈ మాట అనగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. అయితే బిగ్ బీ అంతటితో ఆగకుండా, తమ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌కు సంబంధించిన పాత మెసేజ్‌ను అక్కడి స్క్రీన్‌పై అందరికీ చూపించారు. దీంతో స్టూడియోలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.
‘వారంలో రిప్లై ఇస్తా’ అంటున్న ప్రీతి జింటా!
బిగ్ బీ తన చాట్ బయటపెట్టడంతో నవ్వులు చిందించిన ప్రీతి జింటా.. వెంటనే దానికి తనదైన శైలిలో క్యూట్ రిప్లై ఇచ్చారు. అమితాబ్ సరదా ఫిర్యాదుకు స్పందిస్తూ.. “ఖచ్చితంగా.. ఈసారి మీ మెసేజ్‌కు సరిగ్గా వారం రోజుల్లో రిప్లై ఇస్తాను సర్” అంటూ నవ్వుతూ బదులిచ్చారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, డింపిల్ బ్యూటీ ప్రీతి జింటాల మధ్య ఉన్న ఈ క్యూట్ అండ్ ఫన్నీ బాండింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు ఈ క్యూట్ మొమెంట్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
పిల్లలకు ‘KBC అంకుల్’గా అమితాబ్
ఇదే ఎపిసోడ్‌లో ప్రీతీ జింటా తన పిల్లలకు అమితాబ్ బచ్చన్ సినిమాల వల్ల కాకుండా మరో కారణంతో చాలా ఫేమస్ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. “మా ఇంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఎక్కువ పాపులర్ అనుకుంటున్నారు? మీరు గెస్ చేయగలరా?” అని ప్రీతీ అడగగా.. అమితాబ్ సరదాగా “ఎవరూ లేరు” అని సమాధానం ఇచ్చారు. “మీరే.. కానీ మీ సినిమాల వల్ల కాదు. సారీ” అంటూ ప్రీతీ చెప్పింది.
తన పిల్లలు అమితాబ్ బచ్చన్‌ను ఆయన సినిమాల ద్వారా కాకుండా ఓ పాట ద్వారా గుర్తుపడుతున్నారని తెలిపింది. “నా పిల్లలు మీ పాట ‘మమ్మా.. షేర్‌వాలా సాంగ్’ వింటారు” అని ప్రీతీ చెప్పింది. దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. చిన్న పిల్లల తల్లిదండ్రులు తనను కలిసినప్పుడు “సర్, నాకు ఐదేళ్ల బిడ్డ ఉంది. మీరు టీవీలో కనిపిస్తే ‘KBC అంకుల్’ అంటారు” అని చెబుతుంటారని అన్నారు.
ALSO READ : Nagarjuna: కొత్త కథలు ఉంటే అన్నపూర్ణకు వచ్చేయండి..
అమితాబ్ బచ్చన్, ప్రీతీ జింటా గతంలో కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘కభీ అల్విదా నా కెహ్నా’ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు KBC 18 వేదికపై వీరిద్దరి సరదా సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘కౌన్ బనేగా క్రోర్‌పతి 18’ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌తో పాటు Sony LIVలో ప్రసారం అవుతోంది.
ఆగస్టు 14న బట్వారా 1947..
స్వాతంత్య్ర సమరానంతరం జరిగిన దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బట్వారా 1947’ . సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి రూపొందించిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించారు. 1947 దేశ విభజన సమయంలో జరిగిన మత ఘర్షణలు, వలసలు, కుటుంబాల విషాద గాథను ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించనుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, జావేద్ అఖ్తర్ సాహిత్యం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.