Reading Time: < 1 minute

పెద్దపల్లిలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలి: కేంద్రమంత్రి కుమారస్వామిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్

Caption of Image.

పెద్దపల్లి సెగ్మెంట్‌లో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీలో కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీ సందర్భంగా పెద్దపల్లి ప్రాంతం  ప్రత్యేకతను కేంద్రమంత్రికి వివరించారు. పెద్దపల్లి ప్రాంతం ఒక ప్రధాన మైనింగ్ బెల్ట్ అని, ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ఈ క్లస్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

పీఎం సేతు క్లస్టర్ ద్వారా యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి, నాణ్యమైన మానవ వనరులను  తయారు చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు.ఎన్ఎండీసీ  సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారంతో పెద్దపల్లిలో ఈ ఐటీఐ క్లస్టర్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కేంద్రమంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తగిన పరిశీలన చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.