Reading Time: < 1 minute

Scholarships: డిగ్రీ చదువుతున్న అమ్మాయిలకు.. 30 వేల స్కాలర్‌షిప్..వెంటనే అప్లయ్ చేసుకోండిలా !

Caption of Image.

ప్రముఖ ఇండియన్ బిలియనీర్, విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్‌షిప్ కోసం అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌ తో అర్హత ఉన్న ఫిమేల్ స్టూడెంట్స్ ఉన్నత విద్య కొనసాగించేందుకు ఏటా రూ.30వేల స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. ఆగస్టు 10న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది. ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

  • అర్హత ఉన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో రెగ్యులర్ విద్యార్థిగా 10, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • 2026-27 విద్యా సంవత్సరంలో 2 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న గుర్తింపు పొందిన అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో మొదటి సంవత్సరం చేరి ఉండాలి.
  • కోర్సు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కళాశాల/విశ్వవిద్యాలయంలో ఉండవచ్చు.
  • ఈ స్కాలర్‌షిప్ మార్కులు లేదా మెరిట్ ఆధారంగా కాదు. ఫౌండేషన్ నిర్దేశించిన అర్హతలను పూర్తి చేయడం తప్పనిసరి.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ‘Register New Applicants Cohort 2026’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మొబైల్ నంబర్‌ను OTPతో ధృవీకరించి, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ చేసి దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్లు..

పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు వివరాలు, 10వ తరగతి మార్కుల మెమో, 12వ తరగతి మార్కుల మెమో, కళాశాల అడ్మిషన్ ప్రూఫ్ రెడిగా ఉంచుకోవాలి.

©️ VIL Media Pvt Ltd.