Reading Time: < 1 minute
Raveena Tandon Scores Super Hits With Back To Back Movies In Her Second Innings

ఒకప్పుడు గ్లామరస్ రోల్స్‌తో కుర్రకారుని మైమరపించిన రవీనా ఠాండన్ ఇప్పుడు కంటెంట్ డ్రివెన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. 2024లో లీగల్ డ్రామాగా వచ్చిన ‘పట్నా శుక్లా’ చిత్రంలో ఒక సాధారణ గృహిణిగా, అలాగే న్యాయం కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆమె కనబరిచిన అభినయానికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక అదే ఏడాది డిస్నీ హాట్‌స్టార్‌లో వచ్చిన ‘కర్మ కాలింగ్’ థ్రిల్లర్ సిరీస్‌లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో సత్తా చాటి రవీనా జియో సినిమాలో విడుదలైన ‘గుడ్‌చడి’ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం రవీనా ఠాండన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా, అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ కామెడీ మూవీ వెల్‌కమ్ టు ది జంగిల్‌లో రవీనా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలోనూ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ‘లాయర్’ అనే విభిన్నమైన ప్రాజెక్ట్‌లోనూ రవీనా నటించనున్నారు. పాత్ర ఏదైనా సరే తనదైన అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో మెప్పించే రవీనా ఠాండన్, అటు కమర్షియల్ చిత్రాలతో పాటు ఇటు ఓటీటీ కంటెంట్‌ను కూడా సమంగా బ్యాలెన్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. 2006లో విడుదలై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన మాలామాల్‌ వీక్లీ మూవీ సీక్వెల్‌లోను నటించనుంది. ఇలా కూతురు రాషా తడానీ కంటే జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది  ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ రవీనా ఠాండన్.