Reading Time: 3 minutes
Honor Robot Phone Launched With 200mp Dual Cameras 200x Zoom And 7060mah Battery

HONOR Robot Phone: హానర్ (HONOR) నుండి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ “రోబోట్ ఫోన్ (Robot Phone)”ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. కెమెరా టెక్నాలజీ, సినిమాటిక్ వీడియో రికార్డింగ్, ప్రో-లెవల్ ఇమేజింగ్‌తో పాటు AI ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఫోన్ రూపుదిద్దుకుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలోనే మొదటి సారిగా టైటానియం అల్లోయ్ గింబల్ ఇమేజింగ్ సిస్టం (Titanium Alloy Gimbal Imaging System)ను అందించారు.

డిస్‌ప్లే:

ఈ రోబోట్ ఫోన్లో 6.31 అంగుళాల 1.5K LTPO OLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉంది. ఇది 2640 × 1216 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌ను కలిగి ఉంది. స్క్రీన్ గరిష్ఠంగా 6,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అలాగే 2,000 నిట్స్ HBM బ్రైట్‌నెస్, 4,320Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి. బయట ఎండలో స్క్రీన్ స్పష్టంగా కనిపించేందుకు యాంటీ-రిఫ్లెక్టివ్ (AR) ఫిల్మ్‌ను కూడా ఉపయోగించారు.

కెమెరా సిస్టమ్:

హానర్ రోబోట్ ఫోన్లో ప్రధాన ఆకర్షణ “కెమెరా సిస్టమ్”. ఇందులో ఇండస్ట్రీలోనే తొలి టైటానియం అల్లోయ్ గింబల్ ఆర్కిటెక్చర్ ను పరిచయం చేసింది. ఏరోస్పేస్-గ్రేడ్ టైటానియం అల్లాయ్‌తో తయారు చేసిన ఈ గింబల్ నిర్మాణం సాధారణ స్మార్ట్‌ఫోన్ గింబల్స్‌తో పోలిస్తే 65% తక్కువ వాల్యూమ్‌ను ఆక్రమిస్తుంది. ఇందులోని టైటానియం అల్లాయ్ గింబల్ మోటార్ సెకనుకు 360 డిగ్రీల వరకు రొటేషన్ వేగాన్ని అందిస్తుంది. దీంతో కదులుతున్న సమయంలో కూడా కెమెరాను స్థిరంగా ఉంచుతూ ప్రత్యేకమైన షాట్‌లను క్యాప్చర్ చేయవచ్చు.

ఫోన్‌లో ప్రధాన కెమెరాగా 200MP 1/1.28-అంగుళాల సెన్సార్ ను ఉపయోగించారు. ఇది f/1.6 అపెర్చర్, OISతో వస్తుంది. దీనికి తోడు 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఇందులో 2.5cm మాక్రో ఫోటోగ్రఫీ సపోర్ట్ కూడా ఉంది. మరో ముఖ్యమైన కెమెరా 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్. ఇది 1/1.4-అంగుళాల పెద్ద సెన్సార్, 2.7x ఆప్టికల్ జూమ్, f/2.6 అపెర్చర్, OISతో వస్తుంది. ఇది డిజిటల్ జూమ్ 200x వరకు ఉంటుంది. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 90 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, f/2.0 అపెర్చర్‌తో వస్తుంది.

ప్రాసెసర్:

ఈ ఫోన్‌లో Qualcomm ఫ్లాగ్‌షిప్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను అందించారు. 4.6GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ CPUతో పాటు Adreno 840 GPU ఉంది. ఇది 12GB, 16GB RAM ఆప్షన్లలో, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఫోన్ MagicOS 10 ఆధారిత Android 16పై పనిచేస్తుంది.

ARRI టెక్నాలజీ:

హానర్ రోబోట్ ఫోన్ వీడియో రికార్డింగ్ సామర్థ్యాల్లో కూడా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది 10-bit ARRI LogC3, ARRI Wide Gamut 3, ARRI CINEMA మోడ్‌లో రియల్‌టైమ్ ARRI Looks ప్రివ్యూకు సపోర్ట్ చేస్తుంది. రికార్డ్ చేసిన ఫుటేజ్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అయిన DaVinci Resolve వంటి ప్లాట్‌ఫామ్‌లలో స్టాండర్డ్ ARRI LUTలను ఉపయోగించి ఎడిట్ చేసుకునేలా ఉంటుంది. RAW డొమైన్‌లోనే నాయిస్ రిడక్షన్ చేయడంతో పాటు 14-bit 4:4:4 డేటాను ప్రాసెస్ చేసి 10-bit LogC3, 4:2:2 వీడియోగా అవుట్‌పుట్ చేస్తుంది. AI నాయిస్ రిడక్షన్ ద్వారా వీడియో సిగ్నల్-టు-నాయిస్ రేషియోను 8dB వరకు మెరుగుపరచవచ్చని హానర్ తెలిపింది. AI డైనమిక్ రేంజ్ ఆప్టిమైజేషన్ ద్వారా 14 స్టాప్‌ల వరకు డైనమిక్ రేంజ్‌ను అందిస్తుంది.

YOYO Robot Modeతో AI కెమెరా:

MagicOS ఆధారంగా పనిచేసే YOYO Robot Mode ఈ ఫోన్‌లో మరో ప్రత్యేక ఫీచర్. ఇందులోని మోటరైజ్డ్ గింబల్‌ను ఆటోమేటిక్‌గా పనిచేసే కెమెరా క్రూగా మార్చుకోవచ్చు. టిల్ట్ లాక్, ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV), FPV వర్టికల్, AI స్పిన్ షాట్ వంటి మోషన్ మోడ్‌లు ఉన్నాయి. మల్టీ మోడల్ పెరిసిప్షన్, స్పటిల్ అవర్నెస్, వాయిస్ సోర్స్ లోకలైజేషన్, జెస్చర్ రెకగ్నిషన్ వంటి టెక్నాలజీల సహాయంతో కెమెరా యూజర్ లేదా సబ్జెక్ట్‌ను ఆటోమేటిక్‌గా ఫ్రేమ్‌లో ఉంచుతుంది. వ్లాగింగ్, లైవ్ స్ట్రీమింగ్ లేదా వీడియో కాల్స్ సమయంలో యూజర్ చేతులతో కెమెరాను ఆపరేట్ చేయకుండానే జెస్చర్ల ద్వారా కెమెరా ఆర్మ్‌ను కంట్రోల్ చేయవచ్చు.

7,060mAh బ్యాటరీ:

ఇందులో 7,060mAh బ్యాటరీ ఉంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, Wi-Fi 7, Bluetooth 6.0, NFC, USB Type-C USB 3.2 Gen1, GPS, Galileo, GLONASS, BeiDou, QZSS, NavIC వంటి సిస్టమ్‌లకు సపోర్ట్ ఉంది. ఫోన్‌కు IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంది.

ధర:

చైనాలో హానర్ రోబోట్ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఫోన్‌కు చైనాలో ఇప్పటికే ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులకు లైఫ్‌టైమ్ ఉచిత YOYO AI మెంబర్షిప్ SVIP ప్రయోజనాలతో పాటు మాగ్నెటిక్ స్టాండ్, Lanyard, 120W అల్-ఇన్-వన్ చార్జర్ ఉన్న యాక్సెసరీ గిఫ్ట్ ప్యాక్‌ను కూడా అందిస్తున్నారు. వీటి ధరలు..

* 12GB + 512GB: 9,999 యువాన్ (రూ.1.41 లక్షలు).
* 16GB + 1TB: 12,999 యువాన్ (రూ.1.84 లక్షలు).