
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మేజర్ సర్జరీకి రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు తారక్. తాజాగా ఈ విషయంపై ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బుధవారం (ఆగస్టు 12) హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ కు సర్జరీ జరగనుందని ఆయన టీమ్ తెలిపింది. సర్జరీ తర్వాత ఎప్పటికప్పడు తారక్ హెల్త్ అప్‌డేట్స్ ఇస్తామంటూ టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ వార్త తెలిసినప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులు కాసింత ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన..
A statement from Mr. @tarak9999 ‘s office pic.twitter.com/1taRPCRuXC
— Jr NTR Fan Club (@JrNTRFC) August 11, 2026